కృష్ణా: మచిలీపట్నంలోని ఏడు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్ష నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేసి, అవసరమైన సూచనలను అందించారు. పరీక్షలను సుజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.