ఆస్తి కోసం కన్న తండ్రిపై కుమారులు దాడి చేసిన ఘటన పుంగనూరులో చోటుచేసుకుంది. గడ్డురులో కాపురం ఉంటున్న వెంకటరమణ (79) కొడుకులు కృష్ణప్ప, నారాయణ ఆస్తి కోసం దాడి చేసి ఇంటి నుంచి గెంటేశారని స్థానికులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద రూ.50 వేల, రెండు ఉంగరాలు రూ.1.50లక్షలు విలువ చేసే LIC బాండ్లను లాక్కొని గాయపరిచినట్లు ఆయన వాపోయారు.