VZM: బొండపల్లి పోలీసు స్టేషన్‌ను ఎస్పీ దామోదర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, లాకప్, రికార్డులు, సిడీ ఫైల్స్‌ను పరిశీలించారు. సీజ్ చేసిన వాహనాలను చట్ట ప్రకారం త్వరితగతిన డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్‌లో స్టాపర్స్, స్పీడ్ బ్రేకర్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, సైబర్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.