KDP: ముద్దనూరులో గోవధను నిషేధించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎస్సై, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గో సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని, గోవధను పూర్తిగా అరికట్టాలని విహెచ్పీ నాయకులు కోరారు. అలాగే అక్రమ పశువుల తరలింపులను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.