BPT: బొడ్డువానిపాలెం రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ కంటైనర్ లారీ బోల్తా కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, క్రేన్ సహాయంతో కంటైనర్ను పక్కకు తొలగిస్తున్నారు.