E.G: కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు CMRF నుంచి మంజూరైన రూ. 1,31,131 విలువైన చెక్కులను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద & మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.