PPM: Y.S షర్మిల రెడ్డి చేపట్టనున్న “ఎంజీ నరేగా బచావో సంగ్రామ్”యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. పార్వతీపురం, కొమరాడ మండలాల్లో డిసిసి అధ్యక్షుడు వంగల దాలినాయుడు పర్యటించి ఈనెల17న జిల్లాకు రానున్న షర్మిల కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీచట్టాన్ని రక్షించడమే యాత్ర లక్ష్యమన్నారు.