అన్నమయ్య: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసం పెంపకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీలేరు ఎంపీడీవో జి.శివశంకర్, ఏపీవో ఎం.అశోక్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు జాబ్ కార్డు, 1-B పత్రం, భూమి ఫొటో, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలన్నారు.