ATP: సింగనమల మండలానికి 30 మెట్రిక్ టన్నుల జిప్సం వచ్చిందని, 28.6 శాతం రాయితీ పంపిణీ చేస్తామని ఏవో అన్వేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 50 కిలోల బస్తా రూ.262 కాగా రాయితీ రూ.75 పోను రైతులు 187.20 చెల్లించాలన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 4 బస్తాలు పంపిణీ చేస్తామని వివరాలు వెల్లడించారు. జిప్పం కావల్సిన రైతులు పట్ట పాసుపుస్తకం,ఆధార్,మొబైల్ నంబరుతో రైతు సేవ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.