కడప నగర శివార్లలోని నగర వనం వద్ద రిమ్స్ పీఎస్ ఎస్సై సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్, డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసి నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు.