శ్రీకాకుళంలోని పాలకొండ రోడ్డులో గల విజయ గణపతి ఆలయాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. అనంతరం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.