NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు బుధవారం గోపాల మిత్రుల వినతి పత్రాన్ని అందజేశారు. గోపాల మిత్రులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యేకు తెలియజేశారు. చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నామని వాపోయారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.