కడప జిల్లా వ్యాప్తంగా ‘మహిళా భద్రత’ లక్ష్యంగా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. శుక్రవారం పోలీస్ అధికారులు గ్రామాలు, కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా సందర్శించి మహిళలు, యువతులు, బాలికలు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టారు.