కృష్ణా: శాంతిభద్రతల బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శనివారం గన్నవరం ఎయిర్పోర్ట్లో సమీక్ష నిర్వహించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ను రూ.3 కోట్లతో ఆధునిక G+3 భవనంగా నిర్మిస్తామని చెప్పారు. రామవరప్పాడులో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసి 9 గ్రామాలకు సేవలు అందిస్తామని వెల్లడించారు. CSR, NRI నిధులతో పనులు చేస్తామన్నారు.