ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం. విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. త్వరలోనే నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.