ప్రకాశం: జిల్లా యువతకు నైపుణ్యాలు అందించేందుకు జిల్లాస్థాయిలో అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. సుంచూరియా యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేయాలని, అడ్వాన్స్డ్ కోర్సులపై ప్రకాశం భవన్లో కలెక్టర్ రాజాబాబు సమీక్ష నిర్వహించారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికార రవితేజ తదితరులు పాల్గొన్నారు.