నెల్లూరు కోటమిట్ట గుంట ప్రాంతంలోని రామిరెడ్డి కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కాలువ దిగువన ఉన్న మున్సిపల్ క్వాటర్స్ నుంచి ఆగ్నేయం వైపు మొత్తం పూడికతో జామైంది. ఇంత దారుణంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నా కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు పట్టించుకోలేదని మండిపడుతున్నారు.