SKLM: రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కిషోరి వికాసం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. బాల్యవివాహాల యొక్క అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా బాల్యవివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు. ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.