ప్రకాశం: కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉదయాన్నే అందరూ వాకింగ్ చేసుకుంటున్నారు. ఓ ఉపాధ్యాయుడు మాత్రం పాఠశాల పరిసరాల శుభ్రత పై దృష్టి సారించాడు. పాఠశాలలో నాటిన మొక్కలకు చుట్టూ పిచ్చి మొక్కలు, ఎండు కొమ్మలను తొలగించాడు. రాళ్లగుట్టలను ఏరీ పారేశాడు. ఈ దృశ్యం అక్కడ వాకింగ్ చేస్తున్న వారు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.