E.G: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ శనివారం రాజమండ్రికి రానున్నారని MRPS నిడదవోలు ఇన్ఛార్జ్ గాలింకి రాము మాదిగ శుక్రవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు R&B గెస్ట్ హౌస్కు చేరుకుని, డాక్టర్ దూలపల్లి సుబ్బారావు మాదిగ సంతాప సభలో పాల్గొంటారన్నారు. ఉమ్మడి జిల్లాల MRPS, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.