TPT: ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా శ్రీవారి వీఐపీ దర్శనం, వసతి కల్పిస్తామని చెప్పి భక్తులను మోసం చేసిన ఇద్దరు నిందితులను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సోషల్ మీడియా పోస్టులతో ఆకర్షించి UPI ద్వారా డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాల భక్తులను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు వెల్లడైంది.