ASR: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. పాడేరులో సీఐటీయూ ఆధ్వర్యంలో కాఫీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. రోజువారీ కూలిరేట్లు, పండ్ల సేకరణ రేట్లు పెంచి చేతులు దులుపుకునే యోచనలో కాఫీ యాజమాన్యం ఉందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందరరావు అన్నారు. కానీ, హెల్పర్స్‌కు కనీస వేతనాలు చెల్లించే ఉద్దేశం యాజమాన్యానికి లేదన్నారు.