ప్రకాశం: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఎస్పీ రాజు అన్నారు. మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఆటోలకు డిజిటలైజేషన్ స్టికర్లు కార్యక్రమంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సందేశాన్ని డ్రైవర్లకు తెలియజేశారు.