ATP: గుత్తి మండలం రజాపురం గ్రామ మాజీ సర్పంచ్, మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్, టీడీపీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ మృతి చెందారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ భౌతికకాయానికి కూటమి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.