TPT: తిరుమలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై పుష్కరిణిలో ఏడు ప్రదక్షిణాలు చేసి భక్తులను కటాక్షించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం స్వామివారిని పుష్కరిణికి తీసుకువచ్చారు.