NTR: పూర్వపు జనసంఘం మాజీ అధ్యక్షుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గురువారం సత్యనారాయణపురంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఆర్తో గైనిక్ ఈఎంటి దంత, కంటి సమస్యలకు పలువురు నిష్ణాతులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తారని నిర్వాహకుడు నాగలింగం శివాజీ తెలిపారు. జాతీయ సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు వివరించారు.