W.G: ఆకివీడు మాదివాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గంగానమ్మ గుడి సమీపంలోని సాదిరెడ్డి సుశీల నివాసంలో ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లోని సామగ్రి మొత్తం కాలి బూడిదవ్వగా, సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫైర్ అధికారి నాగమోహన్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు.