W.G. తణుకు పట్టణంలో సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర రెండవ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొని జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పాదయాత్ర తలపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు, విద్యా, వైద్యం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలను ఈ యాత్రలో ప్రస్తావించారు.