ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (RDO)గా సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన పెంచల ప్రభాకర్‌ను రాష్ట్ర సచివాలయానికి అనుసందానం చేసినట్లుగా సమాచారం.