NTR: స్త్రీ నిధి తదితరాల ద్వారా పొందిన రుణాలను తప్పనిసరిగా జీవనోపాధి కార్యకలాపాలకు, సంపద సృష్టికి సద్వినియోగం చేసుకొని, ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జీవనోపాధులుపై సమావేశం జరిగింది. కుటుంబ స్థాయి సర్వే ఆధారంగా ఈ వార్షిక రుణ ప్రణాళికకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.