KDP: జమ్మలమడుగులో ముస్లింలు భక్తిశ్రద్ధలతో మీలాదున్ నబీ పండుగ జరుపుకున్నారు. జామియా మసీదు నుంచి ప్రారంభమైన శాంతియుత ర్యాలీ పాత బస్టాండ్, గాంధీ కూడలి, సాయిరాం థియేటర్ వీధి మీదుగా గూడు మస్తాన్ వలి దర్గాకు చేరుకుంది. పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ప్రవక్త బోధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం నేతలు పాల్గొన్నారు.