అన్నమయ్య: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండకు నేడు ప్రత్యేక బస్సు సర్వీసును నడపనున్నట్లు ఆర్టీసీ-1 డిపో మేనేజర్ మూరె వెంకట రమణారెడ్డి తెలిపారు. ఈ సర్వీసులో స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ఈ మేరకు ఉదయం 5:30 గంటలకు 6:30 గంటలకు మదనపల్లి డిపో నుంచి బయలుదేరి మల్లయ్య కొండకు చేరుతుందన్నారు. కాగా, సాయంత్రం వరకు షటిల్ సర్వీస్ నడుస్తుందన్నారు.