ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంట రాష్ట్ర మంత్రులు సందడి చేశారు. బుధవారం జరగనున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ కోసం పలువురు మంత్రులు, ముఖ్య నాయకులు అనంతపురానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నివాసంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.