Chandrababu: చంద్రబాబు కేసు విచారణ 9వ తేదికి వాయిదా
తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో సీఐడీ తరపు లాయర్లు తమకు కొంత గడువు కావాలని కోరడంతో సోమవారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే వాదనలు విన్న కోర్టు ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేసింది.
స్కిల్ స్కామ్ కేసు (Skill Developement scam Case)కు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ కూడా సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ (CID) తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీని సుప్రీం కోర్టు (Supreme Court)కు విన్నవించారు. దీనిపై రోహిత్గీ మాట్లాడుతూ..అఫిడవిట్ వేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని రోహత్గీ ఆరోపణలు చేయగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని ధర్మాసనానికి తెలియజేశారు. అయితే ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా 17A చుట్టూ వాదనలు జరిగాయి. 17A వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించారు. అయితే అది వర్తించదని సీఐడీ తరపున లాయర్లు తమ వాదనలను వినిపించారు. కీలక వాదనల అనంతరం ధర్మాసనం క్వాష్ పిటీషన్‌పై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.