»Two Lunch Motion Petitions By Nara Lokesh In Ap High Court Afternoon Hearing
Nara Lokesh: రెండు లంచ్ మోషన్ పిటిషన్లు వేసిన లోకేశ్..హైకోర్టులో మధ్యాహ్నం విచారణ
తనకు ఇచ్చిన నోటీసులపై నారా లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటీషన్లు వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు లోకేశ్ పిటీషన్లను విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాటిపై విచారణ జరగనుంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నేపథ్యంలో ఏపీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో నారా లోకేశ్ (Nara Lokesh)పై కూడా సీఐడీ అధికారులు నోటీసులిచ్చిన (CID Notices) సంగతి తెలిసిందే. అమరావతి రింగ్ రోడ్డు కేసు (Amaravati Ring Road Case)లో లోకేశ్ పేరును 14ఏ కింద చేర్చారు. ఈ నేపథ్యంలో తనకు సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసుల్లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ లోకేశ్ పిటీషన్ (Lokesh Petition) వేశారు.
హెరిటేజ్ సంస్థ (Heritage Company)కు చెందిన తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలని నోటీసుల్లో సీఐడీ (CID) తెలిపిందని, వాటిని హైకోర్ట్ (HighCourt)లో లోకేశ్ సవాల్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానన్నారు. అలాంటప్పుడు వాటిని తానెలా తీసుకొస్తానని లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా లోకేశ్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్ ను హైకోర్టు విచారించనున్నట్లు తెలిపింది. మరో లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా లోకేశ్ దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు సంబంధించి లోకేశ్ ఆ పిటీషన్ వేశారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ వేయడం విశేషం.
ఫైబర్ గ్రిడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరును అకారణంగా కేసులో చేర్చినట్లుగా నారా లోకేశ్ తన పిటిషన్లో వెల్లడించారు. ఆ పిటిషన్ పై కూడా మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. దీంతో నేడు నారా లోకేశ్‌కు కీలకం కానుంది.