»Andhrapradesh A Shock To Posani Krishna Murali A Case Was Registered With The Complaint Of Janasena Leaders
Andhrapradesh: పోసాని కృష్ణమురళికి షాక్.. జనసేన నేతల ఫిర్యాదుతో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదు మేరకు కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishnamurali)కి షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (Ap Film Developement Corporation Chairman)గా పోసాని కృష్ణమురళి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదవ్వడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ పార్టీ నేతలు రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. వారు ఎంతకీ స్పందించడం లేదని జనసేన నేతలు (Janasena Leaders) కోర్టుకెళ్లారు. దీంతో జనసేన నాయకుల వాదనలు విన్న న్యాయస్థానం పోసానిపై కేసు నమోదు (Case File) చేయాల్సిందిగా పోలీసులను ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali)పై ఐపీసీ 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసుపై విచారణ జరగనుంది. జనసేన నేతలు కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించి పోసానికి శిక్షపడేలా చేస్తామని చర్చించుకుంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.