CTR: ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జమ్మ-కాశ్మీర్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని తేజశ్రీ ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.