KKD: ప్రత్తిపాడు మండలంలోని దారపల్లి నుంచి కే. మిర్తివాడ వరకు రూ. 2,80,00,000 ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్డు నిర్మించనున్నట్లు అధికారలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొని రహదారి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం తమ లక్ష్యమని తెలిపారు.