కడప కందిపాలెంలో దళిత మాజీ సైనికుడి ఇంటిని కూల్చివేసి నెల రోజులు గడిచినా బాధితులకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో బాధితులు, అఖిలపక్ష నేతలు ఘటనా స్థలంలో శాంతి హోమం నిర్వహించి, రాజ్యాంగ ప్రతులతో నిరసన తెలిపారు. అర్ధరాత్రి ఇల్లు కూల్చడం అమానుషమని, ఇది రాజ్యాంగ హక్కులపై దాడి అని నేతలు విమర్శించారు. పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలన్నారు.