PLD: నరసరావుపేట శివారులోని ప్లాస్టిక్ వ్యర్థాల గోదాంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ప్లాస్టిక్కు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.