KDP: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా శ్రీ అవధూత కాశి నాయన మండలం ఆమగంపల్లిలో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మాజీ సీఎం పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలు నిర్మిస్తే, ఇప్పటి సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు.