KRNL: దేవనకొండ, తెర్నేకల్, పి. కోటకొండ గ్రామాల రైతులకు ప్రైవేట్ డీలర్ల వద్ద 46.2 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, కావాల్సిన రైతులు ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలని వ్యవసాయ అధికారిని ఉషారాణి తెలిపారు. యూరియా ప్రతీ డీలర్ ఎంఆర్పీ ధరలకే ఇవ్వాలని, ప్రతీ రైతుకు రెండు బస్తాలు ఇవ్వాలని తెలిపారు. యూరియా తీసుకున్న రైతుకు కచ్చితంగా బిల్ ఇవ్వాలని సూచించారు.