ATP: తాడిపత్రి పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన రాబర్ట్ శనివారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దారెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా రాబర్ట్ పేర్కొన్నారు.