SKLM: రణస్థలం మండలంలోని పైడిభీమవరం రెడ్డీస్ పరిశ్రమలో సుమారు రూ. 2 కోట్ల విలువ చేసే ట్యాబ్లెట్ డ్రగ్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 3న పరిశ్రమ ఉన్నత ఉద్యోగులు స్టాక్ తనిఖీ చేయగా సుమారు అరకేజీ ట్యాబ్లెట్ డ్రగ్ మాయమైనట్లు గుర్తించారు. అనుమానితులగా ఉన్న 16 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశామని ఎస్సై చిరంజీవి తెలిపారు.