ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావును ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం నాన్-క్యాడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించినట్లు పేర్కొంది. జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.