శ్రీకాకుళం: పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని పాతపట్నం ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మంచు కరుణాకర్ రావు సోమవారం తెలిపారు. పాతపట్నం మండలంలో కాగువాడ గ్రామంలో సోమవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆరో విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు పోషకులు ఉపయోగించుకోవాలన్నారు.