E.G: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన ‘విద్యామిత్ర’ కార్యక్రమాన్ని వేసవి కాలంలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ నుంచి విద్యాశాఖ అధికారులతో ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించడం అవసరమన్నారు.