సత్యసాయి: పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరచిన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత శుక్రవారం వారి గ్రామానికి వెళ్లి వీరచిన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధైర్య పడకండి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.