కోనసీమ: ముమ్మిడివరం మండలం చింతలపల్లికి చెందిన మల్లాడి మహేశ్వరి అనే మైనర్ బాలిక అదృశ్యమైనట్లు ఆమె తండ్రి సోమవారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మహేశ్వరి తిరిగి రాలేదన్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9440796564 (ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్) నంబరుకు తెలియజేయాలని పోలీసులు కోరారు.