BPT: అద్దంకిలోని వెలుగు కార్యాలయం నందు ఏపిఎం జ్యోతి ప్రసాద్ అధ్యక్షతన గురువారం అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాలంటరీ టీచర్స్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్షర ఆంధ్ర కన్వీనర్ శ్రీనివాసరావు పాల్గొని డ్వాక్రా మహిళలకు బోధించే పాఠ్యాంశాలను వివరించారు. అక్షరం జ్ఞానాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు.